ఉత్తమ ఉపాధ్యాయులకు మంత్రి సన్మానం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలను మంత్రి పోచారం ప్రారంభించారు. ఆ తర్వాత ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో కామారెడ్డి, బీబీ పేట్‌, రామారెడ్డి మండలాలకు చెందిన 77 మంది కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం టీచర్స్‌ డేను పురస్కరించుకుని పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు.

ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ షిండే, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.