కాజోల్‌కు వార్నింగ్!

బాలీవుడ్ భామ కాజోల్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో గ‌ణ‌ప‌తి పండుగ‌, ఈద్ రెండింటిని దేవుళ్ళు క‌లిసి జ‌రుపుకుంటున్నారు. మ‌రి మ‌నం ఎందుకు అలా జ‌రుపుకోకూడ‌దు? దేవుని ఆశీస్సులు అంద‌రికి ఉండాలి.. అని ట్వీట్ చేసింది. దీనిపై అలి ఇమ్రాన్ అనే నెటిజ‌న్ ఇదే నా చివ‌రి హెచ్చ‌రిక.. లేదంటే జ‌రగ‌బోయే పరిణామాల‌కి మీరే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని కామెంట్ చేశాడు. దీనిపై కాజోల్ స్పందించ‌క‌పోయిన‌ప్ప‌టికి కొంద‌రు నెటిజ‌న్స్ మాత్రం ఆ వ్య‌క్తిని తీవ్రంగా విమ‌ర్శిస్తున్నారు. తాను చెప్పిన దాంట్లో ఏం తప్పుంద‌ని స‌ద‌రు స‌ద‌రు నెటిజ‌న్‌ని మంద‌లిస్తున్నారు.