కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకున్నారు

ఆదర్శ రైతుల పేరుతో కాంగ్రెస్‌ నేతలు ప్రజాధనాన్ని పూర్తిగా దోచుకున్నారన్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తమ ఉనికిని చాటుకునేందుకే ఆ పార్టీ నాయకులు ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ లో రైతు సమన్వయ సమితి అవగాహన సదస్సులో మంత్రులు పోచారం, ఈటెల, ఎంపీ సుమన్‌ పాల్గొన్నారు. సమన్వయ సమితులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఈటెల సూచించారు. అటు, అన్నదాతలను ఐక్యం చేసేందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేశారని సుమన్‌ అన్నారు.