కాంగ్రెస్‌ నేతలపై కర్నె, రసమయి ఆగ్రహం

చిన్న చిన్న విషయాలను కాంగ్రెస్‌ నేతలు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. టిఆర్‌ఎస్‌ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ప్రభాకర్, రసమయి మానకొండూరు ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. భూ పంపిణీ విషయంలో ఇద్దరు యువకులు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని ప్రచారం చేయడం తగదన్నారు. తనను కలిసేందుకు వచ్చిన సమయంలో తాను అందుబాటులో లేనని.. వారిని కలిసేందుకు వస్తున్న సమయంలోపే ఘటన జరిగిందన్నారు. యువకులను తానే స్వయంగా మానకొండూరు నుంచి హైదరాబాద్‌కు అంబులెన్స్‌ లో తీసుకొచ్చానని స్పష్టం చేసారు ఎమ్మెల్యే రసమయి. బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఅర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయంటున్న విపక్షాలు.. వారి గత చరిత్ర ఒకసారి సరిచూసుకోవాలని హితవు పలికారు.