కరీంనగర్ లో మోస్తారు వర్షం

కరీంనగర్‌ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. పట్టణంలో తేలికపాటి జల్లులు పడగా.. తిమ్మాపూర్‌, మానకొండూరు మండలాల్లో భారీ వాన కురిసింది. భారీ వర్షానికి రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వరుణుడు కరుణించడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.