కమల్ రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ

రాజకీయ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చాడు నటుడు కమల్ హాసన్. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న కామెంట్లు….ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. దీంతో ఓ వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న పార్టీల్లో తన విప్లవాత్మక భావజాలానికి అనుగుణంగా ఏ ఒక్క పార్టీ లేదని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పార్టీ పెట్టాలని ఆలోచనకు వచ్చానన్నారు. తాను ఏ పార్టీ నేత‌ను క‌లిస్తే ఆ పార్టీతో త‌న‌కు లింకు పెట్టడాన్ని కమల్ తప్పుబట్టారు. ఈ మధ్య కేరళ సీఎం పినరయి విజయన్ ను కలిసిన కమల్….గతంలో డీఎంకే, కాంగ్రెస్ లతో సన్నిహితంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన డీఎంకే చేరుతారని మొదట ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను కమల్ కొట్టిపారేశారు.