కంపెనీ జీతం తీసుకోను!

ఇన్ఫోసిస్ కంపెనీ చైర్మ‌న్‌గా ఇటీవ‌ల నంద‌న్ నిలేక‌ని నియ‌మితుడైయ్యారు. అయితే ఆయ‌న ఈసారి కంపెనీ నుంచి ఎటువంటి జీతాన్ని తీసుకోవ‌డం లేద‌ట‌. ఈ విష‌యాన్ని ఆ కంపెనీ స్ప‌ష్టం చేసింది. ఇటీవ‌ల విశాల్ సిక్కా సీఈవో ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న‌ స్థానంలో నంద‌న్ నిలేక‌నిని నియ‌మించారు. అయితే తాను కంపెనీ నుంచి జీతాన్ని తీసుకోన‌ని నిలేక‌ని చెప్పేశారు. ఇన్ఫోసిస్‌లో నిలేక‌నికి 0.93 శాతం షేర్లు ఉన్నాయి. గ‌తంలో ఇదే సంస్థ‌లో డైర‌క్ట‌ర్‌గా చేసిన ఆయ‌న అప్ప‌ట్లో నెల‌కు 34 ల‌క్ష‌ల జీతం తీసుకునేవారు. కంపెనీకి సీఈవోను వెత‌క‌డ‌మే త‌న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని, మ‌ళ్లీ ఇన్ఫీ బోర్డును పున‌రుత్తేజితం చేస్తామ‌ని నిలేక‌ని తెలిపారు. ఇన్ఫీ చీప్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్‌గా యూబీ ప్ర‌వీణ్ రావు కొన‌సాగుతార‌ని కంపెనీ తెలిపింది.