కంచె ఐలయ్య దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్‌ దిల్‌షుక్‌నగర్‌లో ఆర్యవైశ్యులు ఆందోళనకు దిగారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని వెంటనే బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కంచె ఐలయ్య ఆర్యవైశ్యులకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ సందర్బంగా పి అండ్‌ టీ కాలనీ నుంచి రాజీవ్‌చౌక్‌ వరకు ర్యాలీ తీసి.. కంచె ఐలయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు.