కంగనాపై ఆదిత్య పంచోలి ఆగ్రహం

ఇంట‌ర్వ్యూల‌లో సంచ‌ల‌న కామెంట్స్ చేసే కంగనా ర‌నౌత్ తాజాగా త‌న లేటెస్ట్ మూవీ సిమ్రన్ ప్రమోష‌న్స్ లో కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. ఆదిత్య పంచోలీ త‌నని తీవ్రంగా హింసించే వాడని, అపుడు తాను మైనర్ కావ‌డం వ‌ల‌న‌, ఏం చేయాలో అర్థం అయ్యేది కాదని తెలిపింది. 2016లో రేగిన ‘సిల్లీ ఎక్స్’ వివాదంలో హృతిక్‌కి మ‌ద్దతు తెలిపిన పంచోలి చాలా డేంజ‌ర్ అని కంగ‌నా తెలిపింది. 17 ఏళ్ళ వ‌య‌స్సులో తాను ఇండ‌స్ట్రీకి వ‌చ్చాన‌ని చెబుతూ, ఆదిత్య పంచోలి కుమార్తె కంటే త‌ను ఏడాది చిన్నదనే విష‌యాన్ని వెల్లడించింది. ఇక సినిమా షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఆదిత్య త‌న‌ని ర‌క్తం వచ్చేలా కొట్టాడని, ఈ విష‌యాన్ని త‌న భార్య జ‌రీనా వాహ‌బ్‌కి చెబితే తాను ఏ స‌హాయం చేయ‌క సైలెంట్‌గా ఉండేదంటూ కొన్ని సంచ‌ల‌న విష‌యాలు వెల్లడించింది. దీనిపై ఆదిత్య పంచోలి సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యాడు. “కంగ‌నా ర‌నౌత్‌కి పిచ్చి ప‌ట్టింది. ఇంట‌ర్వ్యూలో పిచ్చోళ్ళు మాట్లాడిన‌ట్టే మాట్లాడింది. నేను ఇండ‌స్ట్రీలో చాలా కాలం నుండి ఉన్నాను. మాపై త‌ప్పుడు వ్యాఖ్యలు చేసిన వారు ఇంత‌వ‌ర‌కు లేరు. నేను ఏం చెప్పాలి, నిజంగా ఆమె పిచ్చిదే. అయిన బుర‌ద‌లో రాళ్ళు వేస్తే ఏమ‌వుతుంది, మ‌న బ‌ట్టలే పాడ‌వుతాయి. కంగనా ఇలాంటి మాట‌లు మాట్లాడ‌డంపై త‌ప్పక లీగ‌ల్ యాక్షన్ తీసుకుంటాను. కంగనా మిగ‌తా వారి గురించి ఏం మాట్లాడిందో నాకు అవ‌స‌రం లేదు. ఆమె నా విష‌యంలో చెప్పిన‌వ‌న్నీ అబ‌ద్దాలే. కంగ‌నా మాట్లాడిన‌వ‌న్నీ నిజాలే అయితే ఆమెని నిరూపించ‌మ‌నండి. నేను నా భార్య ఆమెపై త‌ప్పక లీగ‌ల్ యాక్షన్ తీసుకుంటాం” అ‌ని ఫైర్ ఆదిత్య పంచోలి అయ్యాడు.