ఔటర్ వెంట హరితహారం

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో అర్బన్ పార్కులు అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ చెప్పారు. శామీర్ పేట ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు వెంట హరితహారం పనులను హెచ్ఎండిఎ అధికారులతో కలిసి పరిశీలించారు. ఓఆర్ఆర్ వెంట పచ్చదనం పెంచేందుకు క్షేత్రస్థాయిలో ప్రియాంక పరిశీలించారు. ఔటర్ రింగ్ రోడ్డు వెంట పెద్దసంఖ్యలో మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ పట్టుదలగా ఉన్నారని ప్రియాంక చెప్పారు.