ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర

బంగారం ధర ఇవాళ ఒక్కసారిగా పెరిగింది. బులియన్‌ మార్కెట్లో ఇవాళ ఒక్కరోజే పది గ్రాముల గోల్డ్ ధర 990 రూపాయలు హైక్‌ అయ్యింది. నార్త్ కొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు, హరికేన్‌ ఇర్మా ప్రభావంతో చాలా మంది ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బులియన్ మార్కెట్లో బంగారం ధరకు రెక్కలు వస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర 31 వేల 350 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఎక్కువ కావటంతో బంగారం ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. దాదాపు పది నెలల తర్వాత బంగారం రేటు మళ్లీ గరిష్ట స్థాయికి చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ ఔన్సు బంగారం రేటు 0.31 శాతం పెరిగి.. 1352 డాలర్లకు చేరింది. 2016 సెప్టెంబరు తర్వాత ఔన్సు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే ప్రథమం.