ఐలయ్య ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నాడు

కంచె ఐలయ్య ఉగ్రవాదిలా ప్రవర్తిస్తున్నారన్నాడని ఫైరయ్యారు టీఆర్ఎస్‌ నేతలు. సామాజిక స్మగ్లర్లు కోమటొళ్లు అంటూ పుస్తకం రాయడంతో నే ఆయన దిగజారుడుతనం బయటపడిందన్నారు. టిఆర్‌ఎస్‌ఎల్పీలో ఎంపీ బాల్కా సుమన్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ గౌడ్, గణేష్ గుప్తా, బాలరాజు మీడియాతో మాట్లాడారు. ఐలయ్య వెంటనే పుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆర్యవైశ్యులు శాంతికాముకులు కాబట్టి ఆందోళనలు మాత్రమే చేస్తున్నారని.. ఇతరులైతే ఇప్పటికే ఐలయ్యపై దాడికి ప్రయత్నించేవారిన్నారు. ఇప్పటికైనా ఐలయ్య తీరుమార్చుకొని.. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే పనులకు స్వస్తి పలకాలన్నారు.