ఐదు రాష్ర్టాలకు కొత్త గవర్నర్ల నియామకం

ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌ లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. తమిళనాడు గవర్నర్‌  గా బన్వరిలాల్  పురోహిత్‌ ను నియమించిన రాష్ట్రపతి రామ్  నాథ్  కోవింద్‌… బిహార్  గవర్నర్‌  కేసరినాథ్  త్రిపాఠిని తప్పించి.. ఆయన స్థానంలో సత్యపాల్  మాలిక్‌   ను నియమించారు. గంగా ప్రసాద్  ను మేఘాలయ గవర్నర్  గా అపాయింట్‌  చేశారు. అండమన్  నికోబర్  లెఫ్టినెంట్   గవర్నర్  గా బాధ్యతలు నిర్వహిస్తున్న జగదీష్   ముఖిని అస్సాం గవర్నర్  గా నియమించారు. అరుణా చల్  ప్రదేశ్  గవర్నర్  గా  ఆర్మీ ఉన్నతాధికారి, బీడీ మిశ్రాను నియమించారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతమైన అండమన్   నికోబర్  లెఫ్టినెంట్  గవర్నర్  గా దేవేంద్ర కుమార్  జోషిని అపాయింట్  చేశారు కోవింద్‌.