ఏడాది గరిష్ఠానికి బంగారం ధరలు

బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.200 పెరిగి రూ.30,600కి చేరుకుంది. దేశీయంగా ఆభరణాల కొనుగోలుదారుల నుంచి మద్దతు లభించడంతో బంగారం ధర ఈ ఏడాది గరిష్ఠ స్థాయికి చేరుకుంది. పసిడితోపాటు వెండి ధరలు మరింత పరుగులు పెట్టాయి. కిలో వెండి రూ.200 పెరిగి రూ.41,700కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సిల్వర్ పెరుగడానికి కారణమైందని బులియన్ ట్రేడర్ వెల్లడించారు. సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 0.71 శాతం పెరిగి 1,333.80 డాలర్లు పలికింది.