ఏక్షణమైనా ఫ్లొరిడా తీరాన్ని తాకే అవకాశం!  

కరీబియన్‌ దీవులను అతలాకుతలం చేసిన ఇర్మా తుఫాన్‌.. ఏక్షణమైనా ఫ్లొరిడా తీరాన్ని తాకనుంది. శుక్రవారం తీవ్రత స్థాయి కొంత తగ్గినా.. శనివారం మళ్లీ బలంపుంజుకుంది. ఫ్లోరిడాను తాకే సమయానికి మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో జార్జియా, నార్త్‌  కరోలినా,  సౌత్‌   కరోలినాకు హెచ్చరికలు జారీ చేసింది. ఐతే ఫ్లోరిడాపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉండడంతో.. దాదాపు 60 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా సూచించారు. ఇళ్లు ఖాళీ చేయకుంటే.. ప్రభుత్వం నుంచి విపత్తు సేవలను ఆశించరాదంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా చేశారు. రెస్క్యూ ఆపరేషన్  కోసం 15వందల డాలర్లను మంజూరు చేస్తూ ట్రంప్  ఉత్తర్వులు ఇచ్చారు. శనివారం మధ్యాహ్నానికి మియామికి 395 కి.మీ. దూరంలో ఆగ్నేయ దిశలో ఇర్మా ఉందని జాతీయ హరికేన్‌ కేంద్రం తెలిపింది.