ఎల్లూరు రిజర్వాయర్‌ లో చేపపిల్లలు విడిచిన మంత్రి

రాష్ట్ర వ్యాప్తంగా చేప పిల్లల పంపిణీ ఉద్యమంలా సాగుతోంది. నాగర్ కర్నూల్‌ జిల్లా  కొల్లాపూర్‌ మండలంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. ఎల్లూరు రిజర్వాయర్‌ లో 3 లక్షల 75 వేల చేపపిల్లలను మత్య్సకారులతో కలిసి వదిలారు. ఆ తర్వాత తెట్టేకుంటలో 3వేల చేప పిల్లలను చెరువులో విడిచిపెట్టారు. అనంతరం జీజేఆర్‌ ఫంక్షన్‌ హాల్లో బతుకమ్మ చీరల పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి జూపల్లి.