ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద

పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటమట్టం 148 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 146.70 అడుగులకు చేరుకుంది. ప్రస్తుత నీటి సామర్థ్యం 16.6398 టీఎంసీలు, పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు. ఇన్‌ఫ్లో 1245 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 660 క్యూసెక్కులుగా ఉంది.