ఎయిర్ ఫోర్స్ మార్షల్ కు ప్రధాని పరామర్శ

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మార్షల్‌ అర్జన్‌ సింగ్‌ అనారోగ్యంతో హాస్పిటల్‌ లో చేరారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ రెఫరల్‌ హాస్పిటల్‌ లో జాయిన్‌ చేశారు. ఐసీయూలో ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని రక్షణ శాఖ ప్రకటించింది. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోడీ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆర్మీ ఆస్పత్రికి వెళ్లి అర్జన్‌ సింగ్‌ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అర్జన్‌  సింగ్‌ త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.