ఎయిర్ ఇండియా ఫ్లైట్‌కు తప్పిన ముప్పు

అబుదాబి నుంచి కొచ్చి విమానాశ్ర‌యానికి వచ్చిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండింగ్ స‌మ‌యంలో ర‌న్‌వే ట్రాక్ నుంచి ప‌క్క‌కు జారింది. పార్కింగ్ స్థ‌లానికి వ‌స్తున్న స‌మ‌యంలో ఈ ఘటన జరిగింది. ఈ స‌మ‌యంలో విమానంలో 102 మంది ప్ర‌యాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వీరంతా నిచ్చెన సాయంతో విమానం దిగారు. ఈ తెల్లవారు జామున 2 గంటలకు ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ఆ స‌మ‌యంలో విమానాశ్ర‌య ప్రాంతంలో వ‌ర్షం ప‌డుతున్న‌ట్లు అధికారులు చెప్పారు.  అటు ఈ ఘ‌ట‌నపై ఏవియేషన్ అధికారులు విచార‌ణ‌కు ఆదేశించారు.