ఎడ్యుకేషన్ హబ్ గా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి చెప్పారు. వికారాబాద్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైందని, సమాజ గతిని మార్చేది ఉపాధ్యాయులేనని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. గ్రామీణ విద్యార్ధులకు మంచి విద్యనందించి వారిని మహోన్నత స్థాయికి తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులకు సమాజం రుణపడి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడమే గాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకుల విద్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేస్తోందని మంత్రి వివరించారు.