ఇవాళ ఐఫోన్ -8 విడుదల

గ్యాడ్జెట్  లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆపిల్ 8, ఆపిల్ 8 ప్లస్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆపిల్ పదో వార్షికోత్సవం సందర్భంగా ఆపిల్ 8తో పాటూ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, వాచ్, ఫోర్  కే టీవీని రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు అప్ డేటెడ్  ఆపిల్ 7 తో పాటూ 7 ప్లస్ ను కూడా ఈ ఈవెంట్ లో విడుదల చేసే అవకాశముంది. ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ కోసం ఆపిల్….పూర్తి ఏర్పాటు చేసింది. స్టీవ్ జాబ్స్ థియేటర్ లో జరుగనున్న ఈవెంట్…భారత కాలమానం ప్రకారం రాత్రి పదిన్నరకు ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆపిల్ 8 తో పాటూ 8 ప్లస్ పై పలు లీక్ లు వచ్చినప్పటికీ….అవన్నీ నిజమా? కాదా? అనేది ఇవాళ తేలిపోనుంది. ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ లో కర్వడ్ గ్లాస్, వైర్ లెస్ చార్జింగ్, ఓఎల్‌ఈడీ డిస్ప్లే తో పాటూ అప్ డేటెడ్ కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్ వంటి పలు రకాల ఫీచర్లు ఉంటాయని లీక్ లు వచ్చాయి. అంతే కాదు ఆపిల్ విడుదల చేయనున్న వాచ్, ఫోర్  కే టీవీ కూడా మరో సంచలనానికి తెర తీస్తుందని టెక్ నిపుణులంటున్నారు. ఎల్‌టీఈ టెక్నాలజీకి అనుకూలంగా ఆపిల్ వాచ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.