ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో భద్రతా దళాలు మరోసారి ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. కుల్గమ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాయి. కుల్గమ్‌ జిల్లాలోని కుద్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్‌ సెర్చ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు… భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగారు. దీంతో ప్రతిదాడికి దిగిన సైన్యం ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపేసింది. మృతులు హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కు చెందిన దావూద్‌ అహ్మద్‌ అలీ, షయియార్‌ అహ్మద్‌ వానీగా గుర్తించారు. ఉగ్రవాద శిబిరం నుంచి ఏకే-47, ఇన్సాస్  తుపాకులను అధికారులు స్వాధీన పరుచుకున్నారు.