ఇంటర్ విద్యార్ధిని దారుణహత్య

హైదరాబాద్ లో కిడ్నాప్ కు గురైన  చాందిని జైన్ హత్యకు గురైంది. ఓక్రిడ్జ్ లో 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల మైనర్ బాలిక.. మియాపూర్ దీప్తీశ్రీ నగర్ లో ఈనెల 9 నుంచి కనిపించకుండా పోయింది. దీనిపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసుగా నమోదుచేశారు. అయితే చాందిని జైన్ డెడ్ బాడీని  సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ ప్రాంతంలో పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు.. చాందిని జైన్ ను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. దీనిపై విచారణను కొనసాగిస్తున్నారు.