ఆస్ట్రేలియా పై భారత్ ఘన విజయం

చెన్నై వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన కోహ్లీ సేన 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 281 పరుగులు చేసింది. ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 83 పరుగులతో చెలరేగగా ..ధోని 79 పరుగులు చేశాడు. కేదార్‌ జాదవ్‌ 40, భువనేశ్వర్‌ కుమార్‌ 32 పరుగులతో రాణించారు. ఆ తర్వాత వర్షం కారణంగా డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఆసీస్‌ టార్గెట్‌ ను 21 ఓవర్లలో 164గా అంపైర్లు నిర్ణయించారు. అనంతరం ఛేజింగ్‌కు దిగిన కంగారులు భారత బౌలర్ల ధాటికి 21 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 1130 పరుగులే చేసింది. టీమిండియా బౌలర్లలో చాహల్ మూడు వికెట్లు తీయగా..పాండ్యా, కుల్దీప్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది.