ఆశా వర్కర్ల ఆనందం

ఆశా వర్కర్లకు బతుకమ్మ పండుగ ముందే వచ్చింది. పెంచిన జీతం విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో, ఆశా వర్కర్లు తమ ఆనందాన్ని పంచుకున్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. తమను ఇంటికి పిలిచి అన్నం పెట్టి జీతం పెంచినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు ఆశా వర్కర్స్‌. బతుకమ్మ పండుగ ఈసారి తాము ఘనంగా జరుపుకుంటామన్నారు.