ఆలస్యంగా ఇన్ఫో క్యూ2 ఫలితాలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసిక (జూలై-సెప్టెంబర్) ఫలితాలను అక్టోబర్ 24న విడుదల చేయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి ఇన్ఫోసిస్ సమాచారం ఇచ్చింది. ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాల విడుదల సందర్భంగా సంస్థ క్యూ2 (రెండో త్రైమాసికం) రిజల్ట్స్ తేదీని అక్టోబర్ 13గా పేర్కొంది. అంటే, పదకొండు రోజులు ఆలస్యంగా విడుదల చేయబోతున్నది. సాధారణంగా సంస్థ త్రైమాసికం ముగిశాక పదిహేను రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తుంటుంది. కానీ వాయిదావేయడం చాలా ఏండ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతేకాదు, సంస్థ కొత్త చైర్మన్ నీలేకని హయాంలో విడుదల కాబోయే తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలివే కావడం విశేషం.