ఆరోగ్య తెలంగాణ సాధించటమే లక్ష్యం

అత్యంత మెరుగైన వైద్య సేవలు అందించటంలో హైదరాబాద్ దేశంలోనే నెంబర్ వన్ గా ఉందన్నారు గ్రేటర్ మేయర్ బొంతు రామ్మోహన్.  సీఎం కేసీఆర్  నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణను సాధించటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని  చెప్పారాయన. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ఇంపల్స్ రన్ కు మేయర్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌమారదశలో వచ్చే మానసిక ఒత్తిడుల నివారణే ప్రధాన అంశంగా… ఉస్మానియా మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఈ రన్ ను చేపట్టారు.