ఆమెకు పద్ధతి తెలియదు!

డెమొక్రాటిక్‌ పార్టీ నాయకురాలు హిల్లరీ క్లింటన్‌ పై అమెరికా ప్రసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌  మరోసారి మాటల తూటాలు పేల్చారు. హిల్లరీకి పద్ధతి లేదని విమర్శించారు. అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి హిల్లరీ ప్రతి ఒక్కరినీ విమర్శించడం సరికాదని అన్నారు. తాను రాసిన ది డెప్లొరబుల్స్‌ పుస్తకంలో ఆమె అధ్యక్ష బరిలో ఎదురైన అనుభవాలు, ఓటమికి కారణాలు, ఇతర అంశాలను ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ ట్రంప్ ట్వీట్‌ చేశారు. తన తప్పులు తెలుసుకోకుండా ఇతరులపై నిందలు వేయడం మాత్రమే హిల్లరీకి తెలుసని అన్నారు. డిబేట్స్‌ లో ఓడిపోవడం వల్లే ఆమె గురి తప్పిందని, ఎంత డబ్బు ఖర్చుచేసినా ఆటలో గెలవలేకపోయిందని ట్రంప్ విమర్శించారు.