ఆఫర్ కొట్టేసిన ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్!

అర్జున్ రెడ్డి’ సాధించిన సంచలన విజయాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సినిమాలో హీరోగా చేసిన విజయ్ దేవరకొండ .. హీరోయిన్ గా చేసిన షాలిని పాండే వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్ గా ‘మహానటి’ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపికైన షాలిని పాండే, తాజాగా ‘100% లవ్’ రీమేక్ లో ఛాన్స్ కొట్టేసింది.
తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో 2011లో వచ్చిన ‘100% లవ్’ సూపర్ హిట్ గా నిలిచింది. నాగ చైతన్య .. తమన్నా జంటగా నటించిన ఈ సినిమాను, దర్శకుడు చంద్రమౌళి తమిళంలో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా జీవీ ప్రకాశ్ ను హీరోయిన్ గా లావణ్యత్రిపాఠిని ఎంపిక చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు నుంచి లావణ్య త్రిపాఠి తప్పుకోగా, ఆ ప్లేస్ లోకి షాలిని పాండేను తీసుకున్నారు.