ఆకట్టుకుంటున్న సీఎస్ఐఆర్ ఎగ్జిబిషన్

సీఎస్ఐఆర్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ హబ్సిగూడలోని జహీర్ మెమోరియల్ స్కూల్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని రక్షణ మంత్రి సలహాదారుడు సతీష్ రెడ్డి ప్రారంభించారు. ఆరు రోజులపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జిహిషన్ కొనసాగుతుందని సీఎస్ఐఆర్ డైరెక్టర్ తెలిపారు. సీసీఎంబీ, ఎన్జీఆర్ఐ, ఐఐసీటీ ఆధ్వర్యంలో తయారు చేసిన ఎగ్జిబిట్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. నగరంలోని పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ఎగ్జిబిషన్ ను ఆసక్తికరంగా చూస్తున్నారు.