అర్జన్ సింగ్ భౌతిక కాయానికి రాష్ట్రపతి నివాళి

భారత వాయిసేన వీరుడు మార్షల్ అర్జన్ సింగ్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఆయన భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మౌనం పాటించారు. అటు రక్షణ మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అర్జన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.   రేపు మార్షల్ అర్జన్ సింగ్ భౌతిక కాయానికి రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు  నిర్వహించనున్నట్లు హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆయన గౌరవార్థం సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాన్ని తక్కువ ఎత్తులో ఎగురవేయాలని హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ లో అర్జన్‌ సింగ్‌ 44 ఏళ్ల పాటు సేవలు అందించారు.