అమ్మాయిలు చాలా మారిపోయారు!

లవ్ గురించి, మ్యారేజ్ గురించి ఇప్పటి హీరోయిన్స్ కొందరు ఓపెన్ గా మాట్లాడితే మరి కొందరు కొంత హిపోక్రసీ మెయిన్ టెయిన్ చేస్తారు. నిజానికి ఓపెన్ గా తమ లవ్ ఎఫైర్స్ చెప్పేవాళ్లు తక్కువ. అదే బాలీవుడ్ లో అయితే అక్కడి హీరోయిన్స్ కావాలని స్టోరీలు చెబుతుంటారు. ఇక టాలీవుడ్ లో ఇలా చెప్పేవాళ్లు తక్కువే. టాలీవుడ్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా మాత్రం తన ఒపీనియన్ ఓపెన్ గా చెప్పింది. ఈ తరం అమ్మాయిలు చాలా మారిపోయారని, ప్రేమ విషయంలో త్వరగా ఓ అభిప్రాయానికి రావడం లేదని, వారికి ప్రేమకు, వ్యామోహానికి ఉన్న తేడా తెలిసిపోతోందని హీరోయిన్ తమన్నా చెబుతోంది. హోదాను చూసి పుట్టే ప్రేమతో పోలిస్తే, గౌరవం నుంచి పుట్టే ప్రేమ శాశ్వతమని, యువతీ యువకుల మధ్య అవగాహన కూడా చాలా ముఖ్యమైనదని అంటోంది మిల్కీ బ్యూటీ. తన ప్రేమను పొందాలంటే ఈ లక్షణాలుంటే చాలని, ఇంతకుమించి మరేమీ అక్కర్లేదని తన మనసులో మాట చెప్పింది తమన్నా. జై ల‌వ‌కుశ చిత్రంలో ఐటెం సాంగ్‌తో అల‌రించిన త‌మ్మూ ప్ర‌స్తుతం ప‌లు కోలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది.