అమెరికాకు ఉత్తర కొరియా వార్నింగ్

అమెరికాకు మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్‌ ఉన్. తమ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించేలా ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి చేస్తే అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అమెరికాను హెచ్చరించారు.

ఉత్తరకొరియా నుంచి ఆయిల్‌, టెక్స్‌ టైల్స్‌ దిగుమతులు నిలిపేయాలని… కిమ్‌ జాంగ్‌ పై ట్రావెల్‌ బ్యాన్‌ విధించాలని ఐక్యరాజ్యసమితిని అమెరికా కోరింది. ఆత్మరక్షణలో పడే అమెరికా ఐక్యరాజ్యసమితిలో తమ దేశానికి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తోందని నార్త్ కొరియా విమర్శించింది. అమెరికాను ముంచెత్తేది హరికేన్లు కాదని, వరుస చర్యలతో అంతకు పదింతలు వారికి నష్టం చేస్తామని కిమ్ జాంగ్ స్పష్టం చేశారు.