అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం

అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా మత్స్యకారులకు చేపపిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పెద్దచెరువు, గుర్తూరు రామచెరువులో ఎర్రబెల్లి చేపపిల్లలను వదిలారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో  చేపట్టిన ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.