అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశానికి ఏర్పాట్లు పూర్తి

అన్నాడీఎంకే సర్వ సభ్య సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శశికళను పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాయల్ పేట లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం తో పాటూ ఆ వర్గం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ నేతలు హాజరుకానున్నారు.  మరోవైపు జరిగే సమావేశంపై స్టే విధించాలంటూ శశికళ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ కోర్టు టైం వృథా చేస్తున్నారంటూ ఆ పిటీషన్ ను తిరస్కరించారు న్యాయమూర్తి. అంతేకాదు లక్ష రూపాయలు ఫైన్ కూడా వేశారు.