అన్నదాతలకు సీఎం కేసీఆర్ చేయూత

రైతుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌  రావు అన్నారు. అన్నదాతలకు చేయూత అందించాలన్న సంకల్పంతో… ఎకరాకు 8 వేల రూపాయలు పెట్టుబడి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పలు గ్రామాల్లో… రైతు సమన్వయ కమిటీ సమావేశాల్లో ఎర్రబెల్లి పాల్గొన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు.