అనుభవజ్ఞులు ముందుకు రావాలి

కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు దిశానిర్దేశం చేయడానికి అనుభవజ్ఞులు ముందుకు రావాలని కోరారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో జరిగిన చల్మెడ ఆనందరావు ఆటోబయాగ్రఫీ మై లైఫ్స్ జర్నీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. సమాజాభివృద్ధికి ఆనందరావు లాంటి మహావ్యక్తుల అవసరం ఎంతో ఉందన్నారు కేటీఆర్.

ఆనందరావు ముక్కుసూటి మనిషి అని మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.