అటవీ భూముల డిజిటలైజేషన్ పై కీలక సమావేశం

అటవీ భూముల డిజిటలైజేషన్ పై  హైదరాబాద్  అరణ్య భవన్ లో కీలక సమావేశం జరిగింది.  కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ స్పెషల్  సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ సిద్ధాంత దాస్ పాల్గొన్నారు. సమావేశంలో  తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల అటవీశాఖ ఉన్నతాధికారులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని అటవీ బ్లాకులను డిజిటలైజేషన్ చేయటం, ఖచ్చితమైన అటవీ సరిహద్దులను నిర్దారించటం, పర్యావరణ పరిరక్షణపై సమీక్షించారు.  అనుమతులకు మించి జరిగే మైనింగ్ ఆక్రమణలను అడ్డుకుని.. తీసుకోవాల్సిన అటవీ రక్షణ చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది.