అఖిల్‌తో నివేదిత జోడీ!

అక్కినేని వార‌సుడు అఖిల్.. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శక‌త్వంలో హ‌లో అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 22న విడుద‌ల కానున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా సీనియర్ డైరెక్టర్ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్‌ని ఫిక్స్ చేయ‌గా, ఇప్పుడు మ‌రో హీరోయిన్ కూడా ఉంద‌ని చెబుతున్నారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ‘మగలిర్‌ మత్తుమ్‌’ అనే చిత్రంలో న‌టించిన నివేదిత స‌తీష్‌ని రెండో హీరోయిన్‌గా ఎంపిక చేసిన‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల సమాచారం. హ‌లో మూవీకి సంబంధించి ఇప్ప‌టికే రెండు పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన టీం వ‌చ్చే నెల‌లో టీజ‌ర్ రిలీజ్ చేయాల‌ని భావిస్తుంది. అన్న‌పూర్ణ స్టూడియోస్ బేనర్‌పై నాగ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్- వినోద్ సంగీతాన్ని అందిస్తున్నారు.