అంబర్ పేట ఫ్లై ఓవర్ కు కేంద్రం అనుమతి

హైదరాబాద్ లో అత్యంత రద్దీగా ఉండే నేషనల్ హైవేపై ఫ్లై ఓవర్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. కోఠి-ఉప్పల్ మార్గంలో అంబర్ పేట దగ్గర నాలుగు వరుసల ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రూ.338 కోట్ల అంచనా వ్యయంతో ఒక కిలోమీటర్ 415 మీటర్ల ఫ్లై ఓవర్ ను నిర్మించనున్నారు.

భారీగా ట్రాఫిక్ ఉండే ఈ మార్గంలో ఇరుకుగా ఉండే అంబర్ పేట దగ్గర ఫ్లై ఓవర్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అనుమతి కోరింది. నగరం మధ్య నుంచి వెళ్లే జాతీయ రహదారి కావడంతో కేంద్ర ఉపరితల రవాణ శాఖ మంత్రిగా నితిన్ గడ్కరి ఉన్నప్పుడు పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, టిఆర్ఎస్ ఎంపీలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో, కేంద్రం అనుమతి ఇవ్వడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.