అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్ భూషన్ వాదనలు

కుల్‌ భూషన్ జాదవ్ ఉరిశిక్ష కేసుపై ఇవాల్టి నుంచి అంతర్జాతీయ న్యాయ స్థానంలో వాదనలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గతంలో భారత్, పాకిస్థాన్ లకు చెందిన న్యాయ వాదులు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించారు. అయితే విచారణను వాయిదా వేసిన కోర్టు…నేటి నుంచి తిరిగి విచారణ చేపట్టనుంది. పాకిస్థాన్ లోకి అక్రమంగా ప్రవేశించాడనే ఆరోపణలతో కుల్బుషన్ జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు ఉరి శిక్ష విధించింది. అయితే భారత్ ఒత్తిడితో ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన పాక్…కుల్బుషన్ భారత గూడాచారి అంటూ వాదిస్తోంది.