487 ప‌రుగుల భారత్ ఆలౌట్

శ్రీలంకతో జ‌రుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ సేన 487 ప‌రుగుల భారీ స్కోరు చేసి ఆలౌటైంది. చివ‌ర్లో హార్దిక్ పాండ్యా (108) మెరుపు సెంచ‌రీ చేయ‌డంతో టీమ్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఒక దశ‌లో 421 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయిన స్థితిలో.. చివ‌రి వికెట్‌కు ఉమేష్ యాద‌వ్‌తో క‌లిసి పాండ్యా 66 ప‌రుగులు చేశాడు. లంక బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన పాండ్యా.. కేవ‌లం 86 బంతుల్లోనే 7 సిక్స‌ర్లు, 8 ఫోర్ల‌తో టెస్టుల్లో తొలి సెంచ‌రీ చేశాడు. ఓపెన‌ర్లు ధావ‌న్ (119), లోకేష్ రాహుల్ (85) రాణించారు. ఆ త‌ర్వాత పాండ్యా త‌ప్ప మిడిలార్డ‌ర్‌లో ఎవ‌రూ క‌నీసం హాఫ్ సెంచ‌రీ కూడా చేయ‌లేదు. టీమ్ మిడిలార్డ‌ర్‌ను కుప్ప‌కూల్చిన లంక‌.. పాండ్యా దూకుడును మాత్రం అడ్డుకోలేక‌పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీస్కోరుతో టెస్ట్ సిరీస్‌పై క్లీన్‌స్వీప్‌కు టీమిండియా మంచి రూటు వేసుకుంది. లంక బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ సంద‌క‌న్ 5, పుష్ప‌కుమార 3 వికెట్లు తీసుకున్నారు.