48 గంటల్లో 42 మంది చిన్నారులు మృతి

గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో చిన్నారుల మరణాలు ఆగడం లేదు. గడిచిన 48 గంటల్లో 42 మంది చిన్నారులు మృతి చెందారు. 42 మంది చిన్నారుల్లో.. ఏడుగురు మెదడువాపు వ్యాధితో, మరో 35 మంది చిన్నారులు ఇతర కారణాలతో మృతి చెందినట్లు బీఆర్డీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ పీకే సింగ్ తెలిపారు. ఆగస్టు 27న చిన్నపిల్లల విభాగంలో 342 మంది చిన్నారులు చికిత్స కోసం చేరారు. అందులో 17 మంది మృతి చెందారు. ఆగస్టు 28న 344 మంది చిన్నారులు చికిత్స పొందుతుండగా.. 25 మంది చిన్నారులు మృతి చెందినట్లు పీకే సింగ్ తెలిపారు. ఆగస్టు 7 నుంచి 11వ తేదీ మధ్యలో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నారులు మృతి చెందడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీఆర్డీ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజీవ్ మిశ్రా, ఆయన భార్య పూర్ణిమ శుక్లాను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.