31న వ్యవసాయ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం

ఈ నెల 31న (ఎల్లుండి) రాష్ట్రంలోని వ్యవసాయ అధికారులకు సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనం చేయనున్నారు. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ  విద్యాలయంలో గురువారం వ్యవసాయాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితిల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేస్తారు.