2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు

2022 సంవత్సరం నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. పూణేలో జరిగిన భారతీయ ఆగ్రో ఇండస్ట్రీస్ ఫౌండేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి అన్నదాతలైన రైతులు ఇబ్బందుల నుంచి బయటపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు పలువురు కేంద్రమంత్రులు, ఆగ్రో ఇండస్ట్రీస్ పౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.