15కు పెరిగిన ముంబై మృతుల సంఖ్య

ముంబై భేండి మార్కెట్ లోని జేజే జంక్షన్‌ లో జరిగిన భవన ప్రమాదంలో మృతుల సంఖ్య 15కు పెరిగింది. ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో మరో 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కకున్న మరో 25 మందిని రక్షించారు. గాయపడిన వారిలో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మొత్తం 40 మందికి పైగా సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. ఉదయం ఆరున్నరకు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. భారీ వర్షాలకు దెబ్బతినడంతోనే భవనం కూలిపోయిందని అనుమానిస్తున్నారు.