హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ పటేల్‌కు రివార్డు

ప్రాణాలకు తెగించి 400 మంది విద్యార్థులను కాపాడిన హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్‌పటేల్‌ను మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఘనంగా సన్మానించారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన అభిషేక్‌పటేల్‌కు సీఎం చౌహాన్ రూ.50 వేలు రివార్డు అందజేశారు. హెడ్‌కానిస్టేబుల్ అభిషేక్ పటేల్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని సీఎం చౌహాన్ అన్నారు. చిటోరా గ్రామంలోని ఓ స్కూల్‌లో బాంబు ఉన్నట్లు గుర్తించిన అభిషేక్ పటేల్..10 కిలోల బరువున్న బాంబును పట్టుకుని పరుగెత్తుకెళ్లి కిలోమీటర్ దూరంలో పడేసి.. పలువురి ప్రాణాలు కాపాడారు.