ఎవడి గోల వాడిది!

బాలీవుడ్ భామ నేహాధూపియా చండీగ‌డ్ లో కారులో ప్ర‌యాణీస్తుండ‌గా బ్రేక్ ఫెయిలై ప్ర‌మాదానికి గురైంది. దీంతో అక్క‌డ జ‌నం చేరి కారులో ఉన్న ఆమెను ర‌క్షించే ప్ర‌య‌త్నం చేశారు.. అయితే కారులో ప్ర‌మాణిస్తున్న‌ది హీరోయిన్ నేహ దుపియా అని గుర్తించిన జ‌నం స‌హ‌యం చేయ‌డం మానివేసి ఆమెతో సెల్ళీలి దిగేందుకు పోటీ ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంలో ఆమెకు గాయాల ఏమీ త‌గ‌ల‌క‌పోయినా, ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో సైతం ఇలా సెల్ఫీల‌కు ఎగ‌బ‌బ‌డ‌టం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ తర్వాత వేరే కారు రావడంతో… బతుకుజీవుడా అంటూ ఆమె ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయింది. చండీగఢ్ లో ఓ ఆడియో ఫంక్షన్ కు వెళ్లి, తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.