హర్యానాలో హింసకు ముఖ్యమంత్రిదే బాధ్యత

హర్యానాలో జరిగిన హింసకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్‌ చేసింది. అల్లర్లను నియంత్రించటంలో సీఎం మనోహర్ లాల్‌ కట్టర్‌ పూర్తిగా విఫలమయ్యారని ఆ పార్టీ నేత ఆనందశర్మ విమర్శించారు. ఐదు రోజుల ముందే భద్రత విషయంలో చర్యలు తీసుకోవాలని కోర్ట్ చెప్పినప్పటికీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. 144 సెక్షన్‌ విధించిన తర్వాత కూడా అంత మంది జనం ఒకేచోట గూమిగుడితే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత కట్టర్‌ కు లేదని, వెంటనే ఆయన రాజీనామా చేయాలని ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు.