హర్యానాపై ముంబై విజయం

ప్రొ కబడ్డీలో యు ముంబా జట్టు మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో యు ముంబా 38-32 పాయింట్ల తేడాతో హర్యానా స్టీలర్స్ జట్టును ఓడించింది. రైడింగ్‌లో రెండుజట్లూ 21 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినా ట్యాకిలింగ్‌లో యు ముంబా 14 పాయింట్లు నెగ్గి విజయాన్ని సొంతం చేసుకుంది. యు ముంబా జట్టులో అనూప్‌కుమార్ 8, శ్రీకాంత్ జాదవ్ 6 పాయింట్లు సాధించి విజయంలో కీలకపాత్ర పోషించారు.